శాంసంగ్ ఫోన్లు మీ ఇంటి వద్దే కొనేయొచ్చు..  - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ ఫోన్లు మీ ఇంటి వద్దే కొనేయొచ్చు.. 

August 13, 2020

Samsung phones can be bought at your home.

కరోనా కదా.. ఈ సమయంలో బయటకు వెళ్లి ఏం కొనాలన్నా భయమే. వైరస్‌కు ఎక్కడ టార్గెట్ అవుతామనే ఆందోళన ఉంటుంది. ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా సమయంలో ఎలక్ట్రానికి వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ తన వినియోగదారులకు మంచి వెసలుబాటు కల్పించింది. శాంసంగ్‌కు చెందిన పలు ఉత్పత్తులను కష్టమర్లు ఇంటివద్ద నుంచే కొనేలా వెసలుబాటును తీసుకువచ్చింది. ఈ క్రమంలో ‘ఎక్స్‌పీరియన్స్ శాంసంగ్ ఎట్ హోం’ పేరిట ఓ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కష్టమర్లు తమ ఇంటి వద్దే శాంసంగ్‌కు చెందిన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర శాంసంగ్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. వస్తువులు కొన్నాక డిజిటల్ మాధ్యమంలో చెల్లింపులు చేయవచ్చు.

శాంసంగ్ ఉత్పత్తులను ఇలా కొనాలి.. 

https://www.samsung.com/in/samsung-experience-store/home-delivery-demo/ అనే పోర్టల్‌లో కస్టమర్లు ముందుగా తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయాలి. అనంతరం శాంసంగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలపాలి. ఆ తర్వాత కష్టమర్లు తమకు సమీపంలోని శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. 24 గంటల్లోగా కస్టమర్లకు మనం ఎంచుకున్న స్టోర్ నుంచి అపాయింట్‌మెంట్ కాల్ వస్తుంది. కష్టమర్లు చెప్పిన సమయానికి స్టోర్ ప్రతినిధులు వస్తారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ స్టోర్ ప్రతినిధులు కష్టమర్ కావాలనుకున్న డివైస్‌కు డెమో చూపిస్తారు. కష్టమర్ కావలిస్తే ఆ డివైస్‌ను కొనవచ్చు. పేమెంట్ కూడా డిజిటల్ రూపంలో చెల్లించాలి. ప్రక్రియ పూర్తి కాగానే శాంసంగ్ నుంచి ఫీడ్‌బ్యాక్ కోసం ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఉండే లింక్‌ను సందర్శించి కరోనా జాగ్రత్తలతో ఈ షాపింగ్ అనుభవం ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ చెప్పవచ్చు. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా శాంసంగ్ కంపెనీ ఈ సేవలను అందిస్తోంది. త్వరలో మరిన్ని స్టోర్లను ప్రారంభించనుంది.