Samsung sold 12 lakh phones in one day in india
mictv telugu

స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో శాంసంగ్ జోరు.. ఒక్కరోజులో 12 లక్షల సేల్స్

September 27, 2022

Samsung sold 12 lakh phones in one day in india

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకెళ్తోంది. ఆదివారం ఒక్కరోజే 12 లక్షల ఫోన్ల అమ్మకాలు సాధించి రికార్డు నెలకొల్పింది. వీటి విలువు రూ. వెయ్యి కోట్లని సంస్థ వెల్లడించింది. పండుగ సీజన్‌లో భాగంగా కంపెనీ ఫోన్లపై 17 నుంచి 60 శాతం వరకు ధరలు తగ్గించడంతో కస్టమర్లు పోటీపడ్డారు.

దీంతో అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో ప్రథమ స్థానంతో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో మార్కెట పరిధి రెండింతలు పెరిగినట్టు ప్రకటించింది. గెలాక్సీ సిరీస్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవగా, అన్నింటిలోకి గెలాక్సీ ఎమ్13 బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఈ మోడల్ సాధారణ మరియు 5జీ రేంజులో లభిస్తోంది. 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ కోర్ 4 ఓఎస్‌తో పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్/64 జీబీ ధర రూ. 9,499, 6 జీబీ /128 /జీబీ ధర రూ. 11,499. 5జీ వేరియంట్ 4జీబీ /64 జీబీ ధర రూ. 11,499, 6 జీబీ/ 128 జీబీ ధర రూ. 13,999గా కంపెనీ నిర్ణయించింది. కాగా, ఇన్నాళ్లూ చైనీస్ కంపెనీలైన వన్ ప్లస్, ఒప్పో, వివో ప్రభావంతో కాస్త వెనుకబడిన శాంసంగ్.. తాజా అమ్మకాలతో మళ్లీ పోటీలోకి వచ్చినట్టయింది.