శాంసంగ్ చీఫ్ కు ఇక చిప్పకూడే - MicTv.in - Telugu News
mictv telugu

శాంసంగ్ చీఫ్ కు ఇక చిప్పకూడే

August 25, 2017

చట్టానికి ఎవరూ అతీతులు కారనడానికి తాజా శాంసంగ్ ఉదంతం ఒక ఉదాహరణ.

ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అయిన శాంసంగ్‌ గ్రూప్‌ అధినేత లీ జే-యాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. అవినీతి ఆరోపణల కేసులో ఆయనకు దక్షిణ కొరియా కోర్టు ఈ శిక్ష విధించింది. లీ జే యాంగ్‌ లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వున్నాయి.  ప్రభుత్వ మద్దతుతో లబ్ది పొందడానికి చేసిన కుట్రలో ఆయన ఈ కేసులో చిక్కుకున్నారు. మార్కట్లో మంచి గుర్తింపు వుంది కాబట్టి తను ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నట్టున్నాడు.

కానీ చట్టం కళ్ళు కప్పటం అంత ఈజీ కాదని ఈ ఘటనతో రియలైజ్ కూడా అయినట్టున్నాడు. శామ్‌సంగ్ 230 బిలియన్ డాలర్ల అతి పెద్ద కంపెనీ. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థలో 17 శాతం శామ్‌సంగ్‌దే. శాంసంగ్‌ సీ అండ్‌ టీ, కెయిల్‌ ఇండస్ట్రీస్‌ వివాస్పద విలీనానిని సంబంధించి 2015లో ప్రభుత్వ ఆమోదం కోసం ఈ లంచం ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విలీనాన్ని శాంసంగ్‌ ఎల్‌ అండ్‌ టీ షేర్‌హోల్డర్‌ ఇలియట్ అసోసియేట్స్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ డీల్‌తో కంపెనీని తక్కువ విలువ కడుతున్నారని, కెయిల్‌ ఇండస్ట్రీస్‌ విలువను పెంచుతున్నారని పేర్కొంది.

స్థానిక న్యూస్‌ ఏజెన్సీ యోన్‌హ్యాప్‌ ప్రకారం శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వైస్‌ చైర్మన్‌ లీ, అభిశంసనకు గురైన ఆ దేశాధ్యక్షురాలు పార్క్‌ గెయిన్‌ హెయికు లంచం ఇచ్చారని కోర్టు చెప్పినట్టు తెలిసింది.

అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయిన లీకు 12ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. ఒక్క అవినీతి కేసులో మాత్రమే కాక, అపహరణ, పొరపాటు కేసులో కూడా ఆయనకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. శాంసంగ్ అధినేతకు జైలు శిక్ష ఖారారు అవడం నిజంగా ఒక సంచలనాత్మక తీర్పే.