Samsung to bring Galaxy A04 phone in indian market
mictv telugu

సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్.. 50 పిక్సెల్ కెమెరా, పది వేల ధర

August 25, 2022

దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ ఫోన్ దిగ్గజం సాంసంగ్ మళ్లీ ఇండియాలో తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. షావోమీ, రియల్ మీ, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీలు ఆక్రమించుకున్న తన స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు బడ్జెట్ ఫోన్లను మార్కెట్లోకి తెస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే గెలాక్సీ ఎ సిరీస్‌లో ఫోన్లను విడుదల చేసింది. తాజాగా అదే సిరీస్‌లో మరో బడ్జెట్ ఫోన్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. గెలాక్సీ A04 పేరుతో కొత్త తీసుకొస్తోంది. ఈ ఫోన్‌కి సంబంధించి ఫీచర్లు కంపెనీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఇలా ఉండనున్నాయి. 6.5 ఇంచెస్ హెచ్‌డీ స్క్రీన్, 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఇన్ఫినిటీ వి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, అక్టాకోర్ ఎస్ఓసీ ప్రాసెసర్‌ను పొందుపరిచారు. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటిలో 4 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. కెమరా ప్రత్యేకతగా వస్తున్న ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ధర విషయానికి వస్తే రూ. 10 వేల నుంచి మొదలవుతుందని సమాచారం. ధర ఖచ్చితంగా తెలియాలంటే ఫోన్ లాంచింగ్ వరకు ఆగాల్సిందే.