రష్యాపై శాంసంగ్ సంచలన నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

రష్యాపై శాంసంగ్ సంచలన నిర్ణయం

March 5, 2022

10

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో టెక్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫోన్ల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఆ దేశ మార్కెట్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల వాటా 30 శాతం ఉంది. అంతేకాక, రష్యాలోని కలుగాలో టీవీ ఉత్పత్తుల ఫ్యాక్టరీని కూడా మూసివేస్తున్నట్టు ఈ కొరియన్ టెక్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో శాంసంగ్ కూడా అదే బాట పట్టడంతో రష్యాకు మరింత ఇబ్బందులు తప్పేలా లేవు.