Samuthirakani as Rajappa, unanimous MLA of Macherla Niyojakavargam
mictv telugu

‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి విలక్షణ నటుడి ఫస్ట్ లుక్

July 14, 2022

‘అల వైకుంఠపురంలో’, ‘ఆర్ఆర్ఆర్’, ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు స‌ముద్ర‌ఖ‌ని. తాజాగా ఆయన హీరో నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రంలో మరో పవర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మేర‌కు రాజప్పగా ఆయన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది మాచ‌ర్లనియోజ‌క‌వ‌ర్గం చిత్ర బృందం.ఈ మూవీలో నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా .. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌. ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.అవుట్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది.

ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన టీజర్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఇటీవ‌లే ‘రా రా రెడ్డి’ పాట‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి స‌ముద్ర‌ఖ‌ని ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో రాజ‌ప్ప పాత్ర‌లో స‌ముద్ర‌ఖ‌ని న‌టిస్తున్నారు. లేటెస్ట్‌గా విడుద‌లైన పోస్ట‌ర్‌లో స‌ముద్ర‌ఖ‌ని నెరిసిన జుట్టు, మీసం క‌ట్టుతో ఉన్నారు. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా న‌టించ‌నున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.