Samyuktha Hegde injured on the sets of Kreem, rushed to hospital
mictv telugu

షూటింగ్‌లో గాయపడ్డ నిఖిల్ హీరోయిన్.. ఇన్‌స్టాలో పోస్ట్

July 28, 2022

యంగ్ హీరో నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సంయుక్త హెగ్డే గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ సినిమా కన్నడ మూవీ కిరాక్ పార్టీ మూవీకి రీమేక్ గా వచ్చింది. ఈ సినిమా తర్వాత కాలేజ్ కుమార్ అనే సినిమాలో నటించింది సంయుక్త. అలాగే రీసెంట్ గా తెలుగు ఓటీటీ సంస్థ ఆహా లో రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ మన్మథ లీలలో నటించి మెప్పించింది ఈ అమ్మడు. తాజాగా సంయుక్త క్రీమ్ అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఫైట్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ లో రౌడీలను పై దాడి చేసే సీన్స్ లో సంయుక్త గాలిలోకి ఎగిరి నేలపై టైంకి లాండ్ అవలేక పోయింది. దాంతో కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. సంయుక్త కిందపడిపోవడంతో ఆమె కాలుకు తీవ్రగాయం అయింది. చిత్రయూనిట్ ఆమెను వెంటనే హాస్పటల్ కు తరలించగా.. కొద్దిరోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. సంయుక్తకు గాయమైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.