హైదరాబాద్‌లో నేడు ఆంక్షలు..ఈ రూట్లలోనే - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో నేడు ఆంక్షలు..ఈ రూట్లలోనే

June 2, 2022

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని పోలీసులు తెలిపారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల వరకు అమలులో ఉంటాయని అన్నారు. కావున వాహనదారులు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని సూచించారు. ఈరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆవిర్భావ వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు హాజరయ్యే వారు మళ్లింపు పాయింట్ల వద్ద పాస్‌లు చూపిస్తే, అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు.

ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ..”ఎంజే మార్కెట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్, ఏక్ మినార్, ఆసిఫ్ నగర్, అయోధ్య హోటల్ మీదుగా లక్షీకపూల్ వైపునకు పంపిస్తున్నాము. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి గార్డెన్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్, గన్ ఫౌండ్రీ, అబిడ్స్, బషీర్ బాగ్ వంతెన మీదుగా మళ్లిస్తున్నాం. నిరంకారి భవన్, టైరతాబాద్ నుంచి రవీంద్ర భారతి వైపు నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను టెలిఫోన్ భవన్, అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్ బాగ్ వైపు పంపిస్తున్నాం. హైదర్ గూడా, కింగ్ కోఠి, బీజేఆర్ విగ్రహం నుంచి పీసీఆర్, పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ, తెలుగుతల్లి వంతెన, ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, లక్షీకపూల్ వంతెన, అబిడ్స్ మీదుగా మళ్లిస్తున్నాం. ట్యాంక్ బండ్, రవీంద్రభారతి వైపు నుంచి వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్, టెలిఫోన్ భవన్ రోడ్, లక్షీకపూల్ మీదుగా.. సుజాత హైస్కూల్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలు ఏఆర్ పెట్రోల్ బంక్ మీదుగా మళ్లిస్తున్నాం. తెలుగుతల్లి పైవంతెన, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ వైపు నుంచి ఆదర్శనగర్ మీదుగా వచ్చే వాహనాలు ఆదర్మ్ నగర్ వద్ద మళ్లించి, లిబర్టీ రోడ్, తెలుగుతల్లి పై వంతెన వైపు పంపిస్తున్నాం” అని తెలిపారు.