Sand artist Sudarsan Patnaik from Bhubaneswar wishes PM Modi with 1,213 ‘chai’ cups
mictv telugu

ప్రధాని బర్త్‌డే.. 1200 టీ కప్పులతో మోడీ సైకత శిల్పం

September 17, 2022

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. 1213 మట్టి టీకప్పులను ఉపయోగించి మధ్యలో మోదీ చిత్రంతో ఒడిశా పూరీ బీచ్లో సైకత శిల్పం రూపొందించారు. అందులో హ్యాపీ బర్త్డే మోదీ అని రాసుకొచ్చారు. “మహాప్రభు జగన్నాథుడు ఆయనకు దీర్ఘాయుష్షునిచ్చి, భారతమాతకు సేవ చేసేలా ఆశీర్వదించాలి” అని సుదర్శన్ పట్నాయక్ ట్వీట్ లో తెలిపారు. ఈ 5 ఫీట్ల పొడవున్న ఆకృతి కోసం పట్నాయక్ 5 టన్నుల ఇసుక వాడారు.

ప్రస్తుతం ఈ సైకత శిల్పం ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత ప్రతిభను మెచ్చుకుంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత రాష్ట్రతి ద్రౌపది ముర్ము ఓ ట్వీట్ లో..”ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం మీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు.