తెలుగు రాష్ట్రాల మద్య మరో వివాదం - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల మద్య మరో వివాదం

May 15, 2020

telugu states

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే పోతిరెడ్డిపాడు పేరుతో జల వివాదం నడుస్తోన్న సంగతి తెల్సిందే. పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ వివాదం కొలిక్కి రాకముందే తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. 

కర్నూలు జిల్లా గుండ్రేవుల దగ్గర తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వేందుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేశారు. అంతర్‌ రాష్ట్ర ఇసుక సరిహద్దులను గుర్తించేందుకు ఇరు రాష్ట్రాల అధికారుల సర్వే చేశారు. తమ సరిహద్దుల్లోనే తవ్వకాలు జరిగాయని కర్నూలు మైనింగ్ అధికారులు చెబుతున్నారు. కానీ, తమ సరిహద్దులో తవ్వకాలు జరిపారని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ వివాదపై స్పష్టత రావాల్సిఉంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడడం రెండు రాష్ట్రాలకు శ్రేయస్కరం కాదని రాజాకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.