ఎన్నికల సభలో సీఎం అభ్యర్థిపై చెప్పుల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల సభలో సీఎం అభ్యర్థిపై చెప్పుల దాడి

October 21, 2020

sandal thrown on rjd leader tejaswi yadav

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం తేజస్వి యాదవ్ ఔరంగాబాద్‌ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సభా వేదికపై కూర్చుని ఉన్న తేజస్విపై ఎవరో గుర్తు తెలియని ఆగంతకులు చెప్పులు విసిరారు. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెళ్లి పోగా.. మరోకటి మాత్రం తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజస్వీపై చెప్పులు ఎందుకు వేశారో కారణం తెలియరాలేదు. ఈ ఘటన తరువాత ప్రసంగించిన తేజస్వీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.