చీటింగ్ కేసులకు కేరాఫ్ అడ్రస్‌గా సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ మారుతున్నారు.ఆయన మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా శ్రీధర్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. ఈసారి ఏకంగా బిగ్ బి అమితాబ్ బంధువులకే కుచ్చుటోపి పెట్టిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్లు ఇస్తానని చెప్పి రూ.250 కోట్లు మోసం చేశారంటూ అమితాబ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు..హైదరాబాద్‌లో శ్రీధర్ రావును అరెస్ట్ చేశారు. పలువురిని మోసం చేసిన కేసులో శ్రీధర్ అరెస్ట్ అవ్వడం ఇది నాల్గోసారి.
గతంలో అనేక కేసుల్లో శ్రీధర్ రావు నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌తో పాటు ముంబైలో పలువురు బిల్డర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా జిమ్ ట్రైనర్‌ను లైంగికంగా వేధించినట్టు కేసు నమోదైంది. గత సంవత్సరంలో గచ్చి బౌలి లోని ఈవెంట్ మేనేజర్ పై శ్రీధర్ విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ కేసు తర్వాత అనేమంది బాధితులు ఆయనపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు క్యూ కట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శ్రీధర్ రావుపై పదులు సంఖ్యలో కేసులు ఉన్నాయి.