సంఘమిత్రా జల్దిన బైలెల్లు తల్లీ ! - MicTv.in - Telugu News
mictv telugu

సంఘమిత్రా జల్దిన బైలెల్లు తల్లీ !

June 22, 2017

తమిళ దర్శకుడు సుందర్. సి దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘ సంఘమిత్ర ’ మూవీ రోజొక మెస్మరైజింగ్ అప్ డేట్స్ తో అప్పుడే కావాల్సినంత పబ్లిసిటీని సంపాదించుకుంటున్నది. టైటిల్ రోల్ కోసం ఫస్ట్ నుండీ శృతి హాసన్ పేరే వినబడింది. ఆమె గుర్రం మీద స్వారీ చేస్తున్న ఫస్ట్ లుక్ ను కూడా ఆ మధ్య యూఎస్ లో లాంఛ్ చేసారు. సడన్ గా ఏమైందో పత్తా లేదు గానీ శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుండి కూల్ గా తప్పుకుంది. వన్ ఇయర్ డేట్స్ కూడా ఇచ్చిన తను ఇలా సడన్ షాక్ ఇచ్చేసరికి దర్శకుడు పరేషాన్ అయిపోయిండు.

శృతి కాకపోతే అనుష్క, దీపికా, హన్సిక.., అన్నట్టు చాలా మంది హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇంకా ఏ హీరోయిన్ అనేది తేలలేదు. ‘ సంఘమిత్రా ఎవరో నువ్వు జల్దిన బైలెల్లు తల్లీ.. ’ అన్నట్టు క్రియేటైంది జనాల్లో. ఇది రోజూ ఒక వార్త ఈ సినిమా గురించి బయటకు రావడం వల్లేనని డౌటు !? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? జబర్దస్త్ ప్రోగ్రాంలో లొల్లులు ఏంటనే.., స్పెషల్ స్ట్రాటజిక్ పబ్లిసిటీ ఏమైనా డిజైన్ చేస్కొని ఇదంతా చేస్తున్నారా అనేది డౌటులో మిక్సైన క్శశ్చన్ ??