Home > Flash News > ఏం చెప్పావప్పా సంగప్పా !

ఏం చెప్పావప్పా సంగప్పా !

నాదేశం మారుతోంది.. వహ్వా భారత్.. తారీఫ్ కె కాబిల్ తయారైతున్నది భారత్..కళ్ళు జిగేల్ మనే పథకాలు, ఒళ్ళు పులకరింపజేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలు.. సామాన్యులు సాహో సర్కార్ అని సలాములు చేసేలా సాగుతున్న సంచలన పరిపాలన.. నిజంగా దేశం చాలా మారిపోతోంది.. ఎవ్వరికీ అందనంత.. ఎవరూ పట్టుకోనంత.. ఎవ్వరూ ప్రశ్నించనంత.. ఎవరికి వారు యమునా తీరు.. ఆహ.. ఓహో.. జై భారత్.. జై జై భారత్.. మన దేశం యొక్క స్థితి గతి దారెటు.., ????

అంటూ ప్రముఖ టీవీ జర్నలిస్ట్ ‘ సంగప్ప జెనవాడే ’ గారి అంతరంగం ఇది.. తనదైన శైలిలో చాలా వ్యంగ్యంగా, దేశ పరిణామ క్రమాన్ని వివరించిన తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రభుత్వం యొక్క వివిధ పథకాలు, నిర్ణయాల వెనుక సామాన్య ప్రజలు దండుకుంటోంది ఎంత ? ఇలాంటివెన్నో ప్రశ్నలు సంగప్ప జెనవాడే రాసిన ఈ పత్రంలో మనకు కన్పిస్తాయి. వాస్తవాల కుండను కిందేసి పగులగొట్టిన తీరైన ఈ వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నవి. గుడ్డిగా నమ్మేవారి కళ్ళ చిలుముని వదలగొడుతున్నవి ఈ అక్షరాలు.. వాస్తవాలను వినండనే పిలుపునిస్తున్నవీ పదాలు.. వాళ్ళు చెప్పింది తానా అయితే మీరు తందానా అనకుండా ఒక ప్రశ్నను తయారు చేస్కోండని ప్రశ్నిస్తున్నాయి సంగప్ప వాక్యాలు..

సర్కార్ అంటే రాజకీయ లబ్ది కాదు ప్రజల శ్రేయస్సు అని, సమాజం అంటే వ్యక్తి చెడిపోవడం కాదు వ్యవస్థను బాగు చెయ్యటం అని.. చెప్పిన ఆయన అక్షర సత్యాలను మీరూ చూడండి…

Updated : 3 July 2017 1:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top