లోకకళ్యాణం కోసం నన్ను పీసీసీ చీఫ్ చేయండి..జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

లోకకళ్యాణం కోసం నన్ను పీసీసీ చీఫ్ చేయండి..జగ్గారెడ్డి

November 14, 2019

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ చెప్పినట్లు..కొత్త చీఫ్ ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబు ప్రముఖంగా వినిపిస్తోన్నాయి. టీపీసీసీ పదవిని తాను ఆశిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి సీడబ్ల్యూసీ నేత గులాం నబీ ఆజాద్ ఎదుట వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

jagga reddy.

లోక కళ్యాణం కోసం పీసీసీ పదవి కావాలని అడుగుతున్నానని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే..పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకు ఎలాంటి మెడిసన్ కావాలో తన దగ్గర ఉందన్నారు. ఎవరికి వారు హీరో అనుకుంటే నడవదని ఇతర నేతలకు చురకలు అంటించారు. అన్ని వర్గాలు, మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యతనిస్తుందని, తన జీవితం ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభమైందన్నారు. తాను బహిరంగంగా అన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నానని, పదవి వస్తే..సోనియా, రాహుల్ సూచనల మేరకు పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఈరోజు ఆయన సంగారెడ్డిలో మీడియాతో ముచ్చటించారు.