హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు...జగ్గారెడ్డిపై కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు…జగ్గారెడ్డిపై కేసు నమోదు

January 20, 2020

bgfgh

తెలంగాణ ఆర్థికమంత్రి తన్నీరు హరీష్‌రావుపై అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్స్ 153ఏ, 188, 504ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటమి తప్పదనే నిర్దారణకు వచ్చిన జగ్గారెడ్డి, హరీష్‌రావును టార్గెట్ చేసుకొని అనాగరికంగా దూషణలు చేశారని టీఆర్ఎస్ నాయకులు చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ తెలిపారు. అసభ్యకరమైన, అనాగరికమైన భాష ద్వారా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ సంగారెడ్డికి తలవంపులు తెస్తున్న జగ్గారెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.