పీసీసీ చీఫ్ పదవిపై మాట మార్చిన జగ్గారెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

పీసీసీ చీఫ్ పదవిపై మాట మార్చిన జగ్గారెడ్డి

November 19, 2019

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు..కొత్త చీఫ్ ఎంపికకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకకళ్యాణం కోసం పీసీసీ పదవి కావాలని అడుగుతానన్నారు. తనకు అవకాశం ఇస్తే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకు ఎలాంటి మెడిసన్ కావాలో తన దగ్గర ఉందన్నారు. 

Sangareddy.

తాజాగా జగ్గారెడ్డి మాట మార్చారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డినే కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఉత్తమ్‌ను మార్చాల్సివస్తే తనకు మద్దతు ఇవ్వాలని భట్టి విక్రమార్కను కోరారు. జగ్గారెడ్డి ఆసక్తిపై స్పందించిన మిగతా నేతలు.. సిరియస్‌గా ప్రయత్నం చేస్తున్నావా అని ఆయన్ను ప్రశ్నించారు. రెడ్డి సామాజికవర్గానికి అవకాశం వస్తే పోటీలో ఉన్నవాళ్లంతా సమర్థులేనని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ మార్పు అనివార్యమైతే సైలెంట్‌గా పని చేసుకుపోయే శ్రీధర్‌బాబుకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానని జగ్గారెడ్డి అన్నారు. సీఎల్పీలో భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మధ్య ఈమేర ఆసక్తికర చర్చ జరిగింది.