Sangli mass suicide: Probe reveals family members were poisoned to death, two held
mictv telugu

ఒకే కుటుంబంలో 9 మంది.. ఆత్మహత్య కాదు.. షాకింగ్ నిజాలివే

June 28, 2022

Sangli mass suicide: Probe reveals family members were poisoned to death, two held

ఏనిమిది రోజుల క్రితం మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మైసాల్‌లో ఒకే కుటుంబంలో 9 మంది మరణించిన ఘటనలో.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిది ఆత్మహత్య కాదని.. హత్య అని తేల్చారు పోలీసులు. గుప్తనిధుల కోసం.. ఇద్దరు మాంత్రికులు ఆ కుటుంబంపై విషప్రయోగం జరిపారనే షాకింగ్ నిజాన్ని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులు ధీరజ్ చంద్రకాంత్ సురవశే, అబ్బాస్ మొహ్మద్ అలీ బాగ్వాన్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ దీక్షిత్ గేడామ్ వెల్లడించారు.

ఈ నెల 20న మైసాల్‌లోని ఒకే ఇంట్లో 9 మంది విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. పశువైద్యుడు డా. మాణిక్ యల్లప్ప వాన్మోర్, సోదరుడు పోపట్ యల్లప్ప వాన్మోర్, ఆయన తల్లి, భార్య, పిల్లలు సహా మొత్తం 9 మంది మృతదేహాలు ఒకే ఇంట్లో కనిపించాయి. అయితే.. మృతుడి జేబులో సూసైడ్ నోట్ చూసి ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకున్నారు పోలీసులు. విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. ఇంట్లో మృతదేహాలు పడి ఉన్న తీరు చూసి అనుమానంతో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వాన్మోర్ కుటుంబానిది ఆత్మహత్య కాదు.. సామూహిక హత్యలు అని తేల్చారు. వారందరిపై విష ప్రయోగం చేసి, చంపేశారని వెల్లడించారు.