సానియా మీర్జా ఇంట మోగనున్న పెళ్లి బాజా - MicTv.in - Telugu News
mictv telugu

సానియా మీర్జా ఇంట మోగనున్న పెళ్లి బాజా

October 7, 2019

Sania Mirza

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి మొదలుకాబోతోంది. ఆమె చెల్లి ఆనమ్ మీర్జా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్ కొడుకు అసద్‌తో ఆనమ్ మీర్జా వివాహం జరగనుంది. డిసెంబర్‌లో వీరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సానియా వెల్లడించింది. ఆదివారం ఢిల్లీలో టెన్నిస్ టోర్నీకి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 

చాలా కాలంగా  ఆనమ్ – అసద్ మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి ఇంట్లో వాళ్లు అంగీకరించడంతో వీరి నిక్కా పక్కా అయింది.  ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లలో కూడా వీరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు దర్శనం ఇస్తున్నాయి. కాగా అసద్ కంటే ఆనమ్ మూడేళ్లు పెద్దదిగా తెలుస్తోంది. ఏది ఏమైనా చాలా కాలం పాటు సాగిన వీరి ప్రేమాయనం పెళ్లి బంధంతో మరింత బలపడనుంది.