Sania Mirza: సానియా మీర్జా తీవ్ర భావోద్వేగం..కంటతడి..!
భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ ముగిసింది. హైదరాబాద్‌లో సొంత అభిమానులు ముందు తన చివరి మ్యాచ్ ఆడింది సానియా. దీంతో ఎల్బీస్డేడియం పరిశరాలు సందడిగా మారాయి. సానియా మ్యాచ్ చూసేందుు అభిమానులు, కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ మ్యాచ్‌ను తిలకించారు. మ్యాచ్ తర్వాత సానియా కంటతడి పెట్టింది.
ఫేర్‌వెల్ మ్యాచ్‌లో సానియా,బోపన్న-ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తన ట్రేడ్ మార్క్ షాట్లతో సానియా మీర్జా అలరించింది. స్థానిక అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య వీడ్కోలు మ్యాచ్‌లో హూషారుగా ఆడుతూ కనిపించింది. మ్యాచ్ ముగియగానే తీవ్ర భావోద్వేగానికి గురైంది.
సొంతగడ్డపై నన్ను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ మధ్య తుది మ్యాచ్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలకడం సంతోషంగా ఉందని సానియా మీర్జా తెలిపింది. బ్యాట్మింటన్ తరహాలో టెన్నిస్‌లోనూ సమర్థమైన వ్యవస్థ నిర్మితం కావాలి. "ఇక భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దడం కోసం తన సమయాన్ని వెచ్చిస్తాను. వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పాలనలో భాగస్వామిని కావాలనుకొంటున్నాను. సినిమాలపై ఆసక్తి లేదు.బాలీవుడ్ ఆఫర్ వచ్చినా తిరస్కరించాను. వింబుల్డన్ జూనియర్ ఛాంపియన్ షిప్ గెలిచాక తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు లభించిన అపూర్వ స్వాగతం తన జీవితంలో మరువలేనిది. అని సానియా మీర్జా" వివరించారు.
జనవరిలో సానియా మీర్జా అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె తన చివరి మ్యాచ్‌ను ఆడారు. ఆ మ్యాచ్‌లో సానియాకు విజయం దక్కలేదు. ఓటమితో సానియా కెరీర్‌ను ముగించడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అదే విధంగా స్వదేశంలో సానియా లాస్ట్ మ్యాచ్ చూడలేకపోయామని నిరాశకు గురయ్యారు.దీంతో
స్వదేశంలో, సొంత అభిమానులు మధ్య ఆఖరి మ్యాచ్ ఆడాలనే ఉద్దేశంతో నేడు ఫేర్‌వెల్ మ్యాచ్‌ను నిర్వహించారు.