తల్లి కాబోతున్న సానియా మీర్జా - MicTv.in - Telugu News
mictv telugu

తల్లి కాబోతున్న సానియా మీర్జా

April 23, 2018

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో తల్లికాబోతోంది. దాను గర్భం దాల్చినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అయితే నేరుగా చెప్పకుండా పాపసీసా, చిన్నపిల్లల బట్టలున్న ఫోటో పోస్ట్ చేసి, బేబీ మీర్జామాలిక్ అని రాసేసింది. తమకు పుట్టబోయే బిడ్డకు మీర్జా మాలిక్ అని పేరు పెడతామని సానియా కొన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. 31 ఏళ్ల సానియా పాక్ క్రికెటరైన షోయబ్ మాలిక్‌ను 2010లో పెళ్లాడింది. ఇది అతనికి రెండో పెళ్లి.