sania mirza retirement-speech
mictv telugu

నేను సాధించినది ఎంతో ఉంది కానీ ట్రెండ్ సెట్టర్ మాత్రం కాదు

February 22, 2023

టెన్నీస్ సంచలనం సానియా మీర్జా తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలికారు. ఇరవై ఏళ్ళ కెరీర్ లో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన ఈ హైదరాబాదీ దుబాయ్ ఓపెన్ లో ఓటమి తర్వాత వీడ్కోలు చెప్పారు. ఐదేళ్ళ వయసులో రాకెట్ పట్టిన సానియా మీర్జా ఎన్నో విజయాలు అందుకున్నారు. మూడు డబుల్స్ గ్రాండ్ స్ాలమ్, మూడు మిక్స్డ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచి మరో ఇతర భారత మహిళ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నారు. 43 డబుల్స్ ట్రోఫీలు, 91 వారాలు వరల్డ్ నంబర్ వన్ గా కొనసాగారు.

నా జీవితంలో టెన్నీస్ ఎప్పటికీ ఉంటుంది అని చెప్పారు సానియీ మీర్జా. ఏనాడు ఓటమికి భయపడని తాను అది మాత్రమే జీవితం అని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఓడిన ప్రతీసారీ మళ్ళీ గెలుస్తాననే ధైర్యంతో ఆడానని, పరాజయాలు తన మీద ప్రభావం చూపలేదని చెప్పారు. ఓడినప్పుడు కచ్చితంగా బాధ ఉంటుందని కానీ దాంతో జీవితం ాగిపోదని చాలా తొందరగానే తెలుసుకున్నాని అన్నారు.

డబుల్స్ వల్లనే తనకు గుర్తింపు వచ్చింది, అందుకు తనకు చాలా గర్వంగా ఉందని చెప్పారు సానియా. సింగిల్స్ లో మన దేశం నుంచి ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాప్ 30లోకి వచ్చాను….అదీ గొప్ప ఘనతే అని చెప్పుకున్నారు.ఒలిపింక్ పతకం లేకపోయినా సాధించిన దానితో తృస్తిగా ఉన్నాని అన్నారు. మణికట్టు ఇబ్బంది వల్లనే తాను సింగిల్స్ ఆడలేకపోయానని, ఏ ఫార్మాట్ లో అయినా నంబర్ వన్ గా ఉండడం అంత చిన్న విషయమేమీ కాదని చెప్పుకొచ్చారు. ఇంత చేసినా తానొక ట్రెండ్ సెట్టర్ ని అని అంటే మాత్రం ఒప్పుకోనని అన్నారు సానియా మీర్జా.తనకు వచ్చిన, నచ్చిన విధంగా ఆడానని అయితే ఎప్పుడూ ప్రయత్నం మాత్రం మానలేదని చెప్పారు. తనకు వచ్చిన పతకాలన్ని అందులో భాగమేనంటూ స్ఫూర్తిదాయకంగా స్పీచ్ ఇచ్చారు.