Sania Mirza Shares Cryptic Post Amid Divorce Rumours With Shoaib Malik
mictv telugu

విడాకులకు సిద్ధమైన సానియా?

November 8, 2022

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ల వివాహ బంధానికి బ్రేక్ పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆ జంట చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ఇంటర్వ్యూ స్టేట్మెంట్లు ఆ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. ‘బద్దలైన హృదయాలు అల్లాను వెతుక్కుంటూ వెళ్తాయి’ అని సానియా మీర్జా ఓ పోస్టు చేయగా.. ఓ టీవీ షోలో తన భార్యనిర్వహించే టెన్నిస్ అకాడమీల గురించి చెప్పాలని షోయబ్‌ను అడగ్గా.. ఆమెకు ఎక్కడెక్కడ అకాడమీలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పిన అతని సమాధానాన్ని బట్టి వారిద్దరూ వేర్వేరుగా కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లోని మీడియా నివేదిక‌ల ఆధారంగా.. సోనియాను షోయెబ్ చీట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మాలిక్‌, సోనియా విడిపోయార‌ని, ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం వేర్వేరుగా జీవిస్తున్న‌ట్లు పాక్ మీడియా చెబుతోంది. సానియా మీర్జా-షోయబ్ మాలిక్ ఏప్రిల్ 2010లో వివాహం కాగా.. 2018లో వీరికి ఓ బాబు జన్మించాడు. వివాహం తర్వాత వీరిద్దరూ దుబాయ్‌లో ఉంటున్నారు. కాగా, వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు ఎందుకు వచ్చాయన్న విషయంలో స్పష్టత లేకున్నప్పటికీ, పాకిస్థాన్‌కు చెందిన ఓ మోడల్‌తో షోయబ్ ఫొటో షూట్ చేశాడని, ఆమెతో షోయబ్‌కు ఎఫైర్ ఉందని కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వార్తలపై ఇటు సానియా గానీ.. అటు షోయబ్‌ గానీ నోరు మెదపకపోవడం గమనార్హం.