భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఇటీవల తన సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికారు. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె తన చివరి మ్యాచ్‌ను ఆడారు. ఆ మ్యాచ్‌లో సానియాకు విజయం దక్కలేదు. ఓటమితో సానియా కెరీర్‌ను ముగించడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అదే విధంగా స్వదేశంలో సానియా లాస్ట్ మ్యాచ్ చూడలేకపోయామని నిరాశకు గురయ్యారు.
దీంతో అభిమానులకు సానియా మీర్జా గుడ్‌న్యూస్ చెప్పింది. మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అది కూడా హైదరాబాద్‌లోని సానియా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాట్లు జరగుతున్నాయి. రేపు(ఆదివారం) జరగనున్న ఈ మ్యాచ్‌లో సానియా, రోహన్ బోపన్న టీమ్స్ తలపడనున్నాయి. డబుల్స్‌లో సానియా – బోపన్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంటను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులతో పాటు సానియా కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
నేడు మీడియాతో మాట్లాడిన సానియా అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నట్లు తెలిపారు.20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ సాధన చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ అని వెల్లడించారు. మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. విజయంతో కెరీర్‌ను ముగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తన 20 ఏళ్ల కెరీర్ ఎంతో సంతృప్తినిచ్చిందని స్పష్టం సానియా మీర్జా స్పష్టం చేసింది.
టెన్నిస్‌లో ఎన్నో విజయాలు సాధించిన సానియా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మెంటార్‌గా సేవలందించనున్నారు.