రైల్వేస్టేషన్‌లో రూ.5 లకే రెండు శానిటరీ నాప్‌కిన్స్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేస్టేషన్‌లో రూ.5 లకే రెండు శానిటరీ నాప్‌కిన్స్‌

March 3, 2018

హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘ హ్యాపీ నారీ ’ యంత్రంలో రూ.5 బిళ్ళ వేయగానే రెండు శానిటరీ నాప్‌కిన్స్ వస్తాయి. ఇది అచ్చు కాయిన్‌బాక్స్ మాదిరి పని చేస్తుంది. మహిళల ఇబ్బందుల దృష్ట్యా శానిటరీ నాప్‌కిన్స్‌ విక్రయ యంత్రాన్ని శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ ప్రారంభించింది. మార్కెట్లో ఒక శానిటరీ నాప్‌కిన్‌ను కొనుగోలు చేయడానికి రూ. 8 ఖర్చు చేయాల్సి వస్తోంది. తగ్గింపు ధరలో అంటే రూ. 5 కే రెండు శానిటరీ నాప్‌కిన్స్‌ను మహిళా ప్రయాణికులకు అందిస్తున్నారు. ఇంకా సౌలభ్యం కోసం శానిటరీ నాప్‌కిన్స్‌ కాల్చే మిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.ఈ యంత్రాలను త్వరలో సికింద్రాబాద్‌, నాంపల్లి స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 200లకు పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ళు హైదరాబాద్ నుండి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి ద్వారా 4 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో మహిళా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటోంది. శానిటరీ నాప్‌కిన్స్‌ రైల్వే స్టేషన్లలో దొరకక వారు ఇబ్బందులకు గురవుతున్నారు.

మొదట ఈ హ్యాపీనారీ యంత్రాన్ని నాందేడ్ డివిజన్‌లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గుంటూరు డివిజన్‌లో ఏర్పాటు చేశారు. మూడోదిగా హైదరాబాద్ డివిజన్‌లో ఏర్పాటు చేయటంపై మహిళా ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ యంత్రాలను రానున్న రోజుల్లో హైదరాబాద్‌ డివిజన్‌లోని నిజామాబాద్‌, కర్నూలు, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ తదితర రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ యంత్రాన్ని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మహిళల విశ్రాంతి గది (లేడీస్‌ వెయిటింగ్‌ హాలు) రైల్వే స్టేషన్ లో రూ.5 లకే రెండు శానిటరీ నాప్‌కిన్స్‌లో ఏర్పాటు చేశారు.