ప్యాడ్ కనిపించిందని 40 మందిని వివస్త్రలను చేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్యాడ్ కనిపించిందని 40 మందిని వివస్త్రలను చేసి..

March 26, 2018

మహిళలపై వివక్షను ప్రశ్నిస్తూ, రుతుస్రావం అసహ్యం, పాపమేమీ కాదని, అదొక శారీర ధర్మమని ప్రచారం సాగుతోంది.  శానిటరీ ప్యాడ్స్ పై సినిమాలు వస్తున్నాయి. మరోపక్క.. అవేమీ పట్టించుకోని కొందరు మూర్ఖులు తమ పాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాంపస్ ఆవరణలో వాడేసిన శానిటరీ ప్యాడ్ కనిపించదని, ఓ వార్డెన్ 40 మంది అమ్మాయిల బట్టలు విప్పి తనిఖీ చేయించింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీకి చెందిన రాణీ ఝాన్సీ లక్ష్మీబాయ్ క్యాంపస్‌లో ఆదివారం ఈ అకృత్యం జరిగింది.ఆ శానిటరీ ప్యాడ్ వాడింది ఎవరో చెప్పాలని వార్డెన్ మొదట విద్యార్థులను బెదిరించింది. విద్యార్థినులు స్పందించకపోవడంతో ఎవరైనా రుతుచక్రంలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి వారి బట్టలను విప్పించింది. తన సహాయకురాలితో విద్యార్థుల లోదుస్తులను కూడా విప్పించబోయింది. దీనిపై బాధితులు వర్సిటీ వైస్ చాన్స్‌లర్  కులపతి ఆర్పీ తివారీకి ఫిర్యాదు చేశారు. ఈ దారుణంపై విచారణ జరిపించాలని ఆయన ఓ కమిటీని వేశారు.