mictv telugu

శానిటరీ ప్యాడ్స్‌కు చుక్కలు చూపుతుంది..

December 29, 2017

మహిళలు శానిటరీ ప్యాడ్స్ పారేశాక అవి ఏమవుతాయి? మునిసిపాలిటీ చెత్తలోకి వెళ్లిపోతాయి. అందులోని ప్లాస్టిక్ పదార్థం ఏళ్లతరబడి విషరసాయనాలు వెదజల్లుతుంది. పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. ఇలా జరక్కకుండా ఒక ప్యాడ్‌ను పూర్తిగా నాశనం చేయాలంటే దాన్ని నాలుగైదు నిమిషాలపాటు 800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడిచేయాలి.

ఏటా వాడుతున్న 113000 టన్నుల ప్యాడ్స్‌ ఎంత కాలుష్యం సృష్టిస్తాయో చెప్పక్కర్లేదు. ఈ సమస్యలకు బెంగళూరు మహిళ నిషా నజ్రే చక్కని పరిష్కారం చూపారు. కాలుష్యం లేకుండా వీటిని కాల్చి పూర్తిగా నాశనం చేసే యంత్రాన్ని( incinerator) రూపొందించారు. దీన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అపార్ట్ మెంట్ కాంప్లెక్సులు, కార్పొరేట్ ఆఫీసులు, స్కూళ్లు తదితర చోట్ల ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఆమె నగర మునిసిపల్ అధికారులను సంప్రదిస్తున్నారు.

ఇందులో ప్యాడ్ వేస్తే వివింధ చాంబర్లలోకి వెళ్లి కాలిపోతుంది. లోపల నీరు వుండడం వల్ల పొగ కూడా రాదు. 10 నిమిషాల్లో 20 ప్యాడ్స్‌ను నాశనం చేయొచ్చు. ప్రస్తుతం రెండు రకాల్లో ఈ యంత్రాలను రూపొందించామని ఆమె తెలిపారు. సాధారణ యంత్రం ధర రూ. లక్ష, అదనపు ఫీచర్స్ ఉన్న యంత్రం ధర రూ. 2.5 లక్షలుగా ఉంటుందని, అయితే ఇంకా వీటిని ఖరారు చేయలేదని చెప్పారు.

వాడేసిన ప్యాడ్‌ను ఒకసారి పారిశుద్ధ్య కార్మికుడికి ఇవ్వాల్సి వచ్చిందని, అయితే అతడే ఏదో దీక్షలో ఉండడం చూసి.. ఈ పద్ధతి మంచింది కాదనిపించిందని ఆమె చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారంగా యంత్రాన్ని తయారు చేయాలనిపించిందని పేర్కొంది.