కడపలో కిక్కు కోసం శానిటైజర్ తాగేస్తున్నారు..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

కడపలో కిక్కు కోసం శానిటైజర్ తాగేస్తున్నారు..(వీడియో)

August 2, 2020

Sanitiser Consuming Instead Liquor .

ఏపీలో మందుబాబుల పరిస్థితి విచిత్రంగా తయారైంది.  ఓ వైపు లాక్‌డౌన్ మరోవైపు మద్యం ధరలు అమాంతం పెరగడంతో చుక్కకోసం పరితపించి పోతున్నారు. ఎక్కువ డబ్బులు వెచ్చించలేక ప్రయత్నామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.మద్యానికి బదులుగా చాలా మంది చవకగా దొరికే శానిటైజర్లను నీళ్లలో కలుపుకొని తాగేస్తున్నారు. ఇలా చేసి వారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో 13 మంది మరణించిన ఘటన చూసి కూడా మార్పురావడం లేదు. కడప జిల్లాలోనూ ఇలాంటి ఓ సంఘటన వెలుగు చూసింది. 

కొందరు వ్యక్తులు శానిటైజర్ లో నీళ్లు కలుపుకుని తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కడప పట్టణంలో కొంత మంది యాచకులు, ఇతర కూలీలు ఇలా శానిటైజర్లు కొనుక్కోని వాటిని నీటిలో కలుపుకొని కిక్కు పొందుతున్నారు.మద్యం కంటే శానిటైజర్ రేటు తక్కువగా ఉండడం ఈ విధంగా చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాగే పోతే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందనే వాదనలు వినబడుతున్నాయి. ఇలాంటి వారిపై ప్రభుత్వం, పోలీసులు దృష్టిపెట్టి వారిని మాన్పించాలని కోరుతున్నారు.