అవసరం అలాంటిది.. కీ చైన్లలో శానిటైజర్..  - MicTv.in - Telugu News
mictv telugu

అవసరం అలాంటిది.. కీ చైన్లలో శానిటైజర్.. 

August 3, 2020

Sanitiser Keychains In Market.

కరోనా దరిచేరకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాస్కు, శానిటైజర్లు వాడటం తప్పనిసరిగా మారిపోయింది. చాలా మంది శానిటైజర్లను వెంట పెట్టుకొని వెళ్తున్నారు.దీంతో శానిటైజర్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లడానికి బదులు కొత్త ట్రిక్ కనుగొన్నారు. ‘కీ’ చైన్లలో శానిటైజర్ తీసుకెళ్లే సదుపాయం తెచ్చారు. దీంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. 

బయటకు తీసుకువెళ్లే సమయంలో ఇబ్బంది లేకుండా ఈ సులువైన మార్గాలు అన్వేషించారు. 50 ML, 30ML వరకు  కీ చైన్‌లో శానిటైజర్ నింపుకుని తీసుకువెళ్లే విధంగా వాటిని తయారు చేశారు. కారు,బైక్, ఇంటి తాళలకు దీన్ని తగిలించుకోవచ్చు. ఇక చిన్న పిల్లలను ఆకట్టుకునేలా చిన్న చిన్న బొమ్మలను కూడా వాటిపై ఏర్పాటు చేసి ఆకర్షిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పరిశుభ్రతతో పాటు ప్రత్యేకించి కీ చైన్ కొనాల్సిన పనిలేకుండా పోతోంది. ఎప్పుడూ వెంటే ఉంచుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.