సంజయ్ దత్ భూమి ! - MicTv.in - Telugu News
mictv telugu

సంజయ్ దత్ భూమి !

August 10, 2017

జైలు నుండి రిలీజ్ అయి వచ్చిన సంజయ్ దత్ ఏ సినిమాలో కనిపిస్తాడోనని బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూసారు. ఆ ఎదురు చూపులకు ఫలితం దక్కనుంది. ‘ భూమి ’ అనే కొత్త సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా షాకిచ్చాడు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింక్ గా వుందని అంటున్నారు జనాలు. ‘ సేవ్ డాటర్ ’ అనే ప్రధాన ఇతివృత్తంతో సాగుతుందట సినిమా. సంజయ్ దత్ తండ్రిగా, అదితీరావు హైదరీ కూతురుగా నటించారు ఈ చిత్రంలో. మేరీకోమ్, సరబ్ జిత్ వంటి వినూత్నమైన సినిమాలను రూపొందించిన ఒమంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. సెప్టెంబర్ 22 కు విడుదలౌతున్న ఈ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. సంజయ్ దత్ బాధ్యత గల తండ్రిగా డిఫరెంట్ రోల్ లో దర్శనమిస్తున్నాడు. చూడాలి మరి భూమి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చి సంజయ్ దత్ కెరియర్ కి ఎలా దోహదపడుతుందో.