రణబీర్‌కు సంజయ్ దత్ సలహా.. పెళ్లి తర్వాత - MicTv.in - Telugu News
mictv telugu

రణబీర్‌కు సంజయ్ దత్ సలహా.. పెళ్లి తర్వాత

April 12, 2022

15

బాలీవుడ్ అందాల తార అలియా భట్, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో రణబీర్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలో తన నటనతో యావత్ దేశ ప్రజలను ఆకట్టుకోబోతున్నా, సంజయ్ దత్ రణబీర్‌కు ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ”ముందుగా రణబీర్‌కు, అలియాకు శుభాకాంక్షలు. రణబీర్ కపూర్ పెళ్లి చేసుకునేట్టు అయితే, నిజంగా నాకు సంతోషమే. అలియా నా ముందే పుట్టి పెరిగిన అమ్మాయి. వివాహం అన్నది ఒకరి పట్ల మరొకరు నిబద్ధత కలిగి ఉండడం, కొంత రాజీ పడడం. దానికి వారు కట్టుబడి ఉండాలి. ఒకరి చేయి మరొకరు పట్టుకుని సంతోషం, శాంతి, కీర్తితో జీవితంలో ముందుకు సాగిపోవాలి. రణబీర్ త్వరగా పిల్లల్ని కను. సంతోషంగా ఉండు’’అని సంజయ్ అన్నారు.

మరోపక్క రణబీర్ కపూర్, అలియా భట్ వివాహం ఈ నెలలోనే ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు. వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు కొద్దిమంది తప్పించి, ఇతరులకు ఆహ్వానం లేదని తెలుస్తోంది. వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సంజయ్ హాజరయ్యే అవకాశం ఉంది. రిసెప్షన్ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించనున్నట్టు సమాచారం. అయితే, ఓ వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంగా సంజయ్ దత్.. రణబీర్ వివాహం అయిన వెంటనే ‘త్వరగా పిల్లల్ని కను’ అని సలహా ఇవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. సంజయ్ దత్ గారూ.. పెళ్లి అయిన తర్వాత ప్రతివారు పిల్లల్ని కనడం కోసమే కష్టపడుతుంటారు. మీరు కొత్తగా చెప్పేది ఏంటని ప్రశ్నిస్తూ, తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.