సినిమాలకు ఒక గ్రాండ్ లుక్ ఉండాలంటే….మూవీ నిండా జనాలు, అందం పోగుపడి ఉండాలంటే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్టర్ గా ఉండాల్సిందే. గ్రాండియర్ కు పేరు గాంచిన వాడు భన్సాలీ. ఏ సినిమా తీసినా, అది ఏ కాలంది అయినా రిచ్ లుక్ తో అదిరిపోవాల్సిందే. అలాంటి సంజయ్ లీలా భన్సాలీ ఇప్పడు ఒక వెబ్ సీరీస్ తీస్తున్నాడు. దాని ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదల చేశారు.
ఆరుగురు అందమైన భామలతో…కవిత్వం చెప్పడానికి రెడీ అవుతున్నాడు భన్సాలీ. ఆరుగురుని ఢిపరెంట్ గా ప్రజెంట్ చేస్తూ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. మనీషా కోయిరాలా, అదితిరావ్, సోనాక్షి సిన్హా , రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీద షేక్ లు ప్రధాన పాత్రలుగా ఇది తెరకెక్కనుంది. ఆలియా భట్ తో తీసిన గంగూబాయ్ కతియావాడి హిట్ అవడంతో మళ్ళీ అదే ఇతివృత్తంగా తీసుకున్నాడు సంజయ్. ఆరుగురు వేశ్యల కథే హీరామండి. పాకిస్తాన్ లో లాహోర్ లోని ఓ వేశ్యావాటిక నేపథ్యంలో హీరా మండి కథ ఉంటుంది.
చాలా రోజుల తర్వాత మనీషా కోయిరాల ఈ వెబ్ సిరీస్ తో మళ్ళీ తెరమీదకు వస్తోంది. గంగూ బాయ్ తర్వాత సంజయ్ కూడా ఏ సినిమాలు తీయలేదు. ఈ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ సమర్పిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ త్వరలోనే రానుంది. స్వాతంత్రానికి ముందు రోజుల్లో వేశ్యల జీవితం ఎలా ఉంటుందో ఇందులో చూపించనున్నాడు. ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.