Sanjay made a video on a minor girl in jarkhand
mictv telugu

ఫ్రెండ్స్‌తో పందెం కాసి మైనర్‌పై అత్యాచారం.. జార్ఖండ్‌లో మరో ఘాతుకం

September 19, 2022

Sanjay made a video on a minor girl in jarkhand

వెనుకబడిన రాష్ట్రమైన జార్ఖండ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. మొదట పొలిటికల్ డ్రామా నడువగా, ఆ తర్వాత నుంచి వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు రాష్ట్రం పరువు తీస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో పందెం కాసిన ఓ యువకుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు.

అంతేకాక, ఆ ఘోరాన్ని వీడియో తీసి ఫ్రెండ్స్‌కి చూపించాడు. అది బాలిక తల్లిదండ్రులకు చేరడంతో కలకలం రేగింది. పూర్తి వివరాలు.. ధన్‌బాద్ ప్రాంతంలో నివసించే సంజయ్ అనే యువకుడు ఓ మైనర్ బాలికను ప్రేమించాడు. అయితే ఈ విషయమై స్నేహితులతో గొడవ జరిగింది. తననే ప్రేమిస్తుందని వారు వాదులాడుకున్నారు. దీంతో రెచ్చిపోయిన సంజయ్ వారితో పందెం కాసాడు. బాలిక తననే ప్రేమిస్తుందని నిరూపిస్తానని శపథం చేశాడు. ఇందులో భాగంగా బాలికను మాయమాటలు చెప్పి పొదల్లోకి తీసుకెళ్లాడు. మొదట్లో మంచిగా ఉండి తర్వాత అత్యాచారం చేశాడు. బాలిక వద్దని నిరాకరించినా బలవంతం చేశాడు. పైగా ఇదంతా వీడియో తీసి స్నేహితులకు పంపి ‘ఆ అమ్మాయి నన్నే ప్రేమిస్తుందనడానికి ఇదే సాక్ష్యం’ అంటూ మెసేజ్ పెట్టాడు. ఈ వీడియోను స్నేహితులు బాలిక బంధువులు, తల్లిదండ్రులకు చూపెట్టడంతో ఆగ్రహానికి గురై యువకుడికి దేహశుద్ధి చేశారు. తగిన బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజయ్‌ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.