శివసేనకు షాక్.. సంజయ్ రౌత్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ - MicTv.in - Telugu News
mictv telugu

శివసేనకు షాక్.. సంజయ్ రౌత్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

April 5, 2022

bfdb

శివసేనలో నెంబర్ 2, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. వెయ్యి కోట్ల పత్రా చాల్ అనే భూ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఈడీ ఈ చర్యకు దిగింది. రౌత్‌కు చెందిన అలీబాగ్‌లోని భవంతిని జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ మీడియాకు మెసేజ్ చేసింది. కొద్దిరోజుల ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బావమరిది శ్రీధర్ ఆస్తులను జప్తు చేసింది. పై రెండు ఘటనలతో కేంద్రం రాష్ట్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నట్టు స్పష్టమవుతోందని ఆ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. అందుకు నిదర్శనంగా శివసేన, ఎన్సీపీ నేతలకు వస్తున్న వరుస నోటీసులు, ఈడీ దాడులే సాక్ష్యమని వారు ఆరోపిస్తున్నారు. మహా వికాస్ అఘాఢి పేరుతో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.