కారులో వెళ్తుండగా మంటలు అంటుకొని ఎన్సీపీ నేత ప్రాణాలు కోల్పోయాడు. ముంబై – ఆగ్రా హైవేపై ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో సంజయ్ షిండే అందులోనే మరణించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పేలోపే ఆపాయం జరిగిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి అతన్ని బయటకు తీశారు.
తోట కోసం పురుగు మందులను కొనేందుకు వెళ్తుండగా పింపల్గావ్ బస్వంట్ టోల్ ప్లాజా సమీపంలో ఇది జరిగింది. కారులోని వైరింగ్ షార్ట్‌సర్క్యూట్ కావడం వల్ల మంటలు వ్యాపించాయి. అందులో శానిటైజర్లు కూడా ఉండటంతో మరింత పెరిగాయి. వాటిని గుర్తించి బయటకు వచ్చేలోపే డోర్లు లాక్ అయ్యాయి. దీంతో పూర్తిగా మంటలు అంటుకోవడంతో అందులోనే అతడు కాలిపోయాడు. కాగా, సంజయ్ షిండే ద్రాక్ష ఎగుమతి చేస్తూ ఉంటారు. నాసిక్ జిల్లాలో ఆయనకు వైన్ తయారీ కేంద్రం కూడా ఉంది. ఈ సంఘటనపై పార్టీ నేతలు సహా పలువురు విచారం వ్యక్తం చేశారు.