Sanjay Singh tore up defamation notices
mictv telugu

ఒక దొంగ పంపిన వాటికి భయపడను.. ముక్కలు చేస్తాను

September 7, 2022

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై దాడులు జరిగిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం, ఎల్జీ సక్సేనాల మధ్య ఆరోపణల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో తనపై అవినీతి ఆరోపణలు చేసిన ఆప్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్, అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లపై ఎల్జీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. పరువునష్టం దావా వేసి నోటీసులు పంపించారు. అంతేకాక, ఇలాంటి ఆరోపణలు మానుకోవాలంటూ పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు. నోటీసులు అందుకున్న సంజయ్ సింగ్ వాటిని మీడియా ముందు ముక్కలుగా చింపేశారు. ఒక దొంగ, అవినీతి పరుడు పంపిన నోటీసులకు తాను భయపడడని వ్యాఖ్యానించారు. ఇలాంటి నోటీసులు ఎన్ని పంపినా వాటన్నింటినీ చింపేస్తానని మండిపడ్డారు. ‘ఈ దేశ పౌరుడిగా నాకు మాట్లాడే హక్కు ఉంది. రాజ్యసభ సభ్యునిగా నిజాలు మాట్లాడాను. తమపై కోపంతో బీజేపీ ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం అక్టోబర్ 11కు వాయిదా వేసింది.