Sanjeev Kumar made the national flag of three and a half kilometers and won the Guinness record
mictv telugu

మూడున్నర కిలోమీటర్ల జాతీయ జెండా.. గిన్నీస్ రికార్డు బద్ధలు

August 13, 2022

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశంలో జాతీయతాభావం పెంచడానికి ప్రతీ ఒక్కరూ జెండాను ఇళ్లపై ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో చాలా మంది జెండాలను ఎగురవేస్తూ దేశం పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా కొందరు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. అయితే జార్ఖండ్ రాష్ట్రంలోని బొరాఖా పట్టణంలో మూడున్నర కిలోమీటర్ల జాతీయ జెండాను రూపొందించి వరల్డ్ రికార్డు సాధించారు. సంజీవ్ కుమార్ అనే సామాజిక వేత్త ఈ జెండాకు రూపకల్పన చేసి గిన్నీస్ రికార్డు సాధించారు. ఇందుకోసం 3500 మీటర్ల వస్త్రాన్ని వాడగా, నలుగురు టైలర్లు, ఇద్దరు పెయింటర్లు రాత్రింబవళ్లు కష్టపడి జెండాను సిద్ధం చేశారు. ఇందులో మహిళలు, బాలికలు కూడా పాల్గొనగా ఆదివారం రోజున జెండాను ఎగురవేస్తామని నిర్వాహకులు తెలిపారు. అదీగాక గిన్నీస్ బుక్ ప్రతినిధులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గతంలో ఈజిప్టు దేశంలో రూపొందించిన రెండున్నర కిలోమీటర్ల జాతీయ జెండానే ఇప్పటివరకు గిన్నీస్ రికార్డుల్లో మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు మన జెండా దానిని అధిగమించనుందని సంజీవ్ కుమార్ వెల్లడించారు.