టీమిండియాలో ఆల్‌రౌండర్ స్థానాన్ని సమర్ధంగా భర్తీ చేస్తున్న హార్ధిక్ పాండ్యా ఇటీవల కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. గతంలో ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్ బాధ్యతలు చేపట్టి టైటిల్ గెలుచుకోగా, సీనియర్ల గైర్హాజరీతో శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కి పూర్తిస్థాయి కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు స్వీకరించాడు. మంగళవారం జరిగిన మొదటి టీ20లో సమర్ధవంతంగా జట్టును ముందుకు నడిపించి మ్యాచ్‌ను గెలిపించాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో హార్ధిక్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
— Guess Karo (@KuchNahiUkhada) January 4, 2023
శ్రీలంక ఇన్నింగ్సులో భాగంగా పాండ్యా బౌలింగ్ ఎటాక్ ప్రారంభించగా మొదటి ఓవర్ రెండో బంతికే లంక ఓపెనర్ నిసాంకను ఔట్ చేసే అవకాశం మిస్ అయ్యింది. పాండ్యా వేసిన బంతిని నిసాంక గాల్లో లేపగా మిడాఫ్‌లో ఉన్న సంజూ బంతిని డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. కానీ తర్వాత చేతులు సడలిపోవడంతో బంతి చేజారింది. దీంతో నిరాశగా కెప్టెన్ వైపు చూసిన సంజూకి పాండ్యా ఇచ్చిన రియాక్షన్ రిలీఫ్‌గా అనిపించింది. ‘పర్లేదులే.. ఏం చేస్తాం’ అంటూ ముఖంలో హావభావాలను ప్రదర్శించాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఎవరైనా ఇలా చేస్తే ఆగ్రహం వ్యక్తం చేసే పాండ్యా.. కెప్టెన్ అయిన తర్వాత మారిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నిజమైన కెప్టెన్ అని నిరూపించుకున్నావు అంటూ ప్రశంసిస్తున్నారు. అటు తర్వాతి ఓవర్ వేసిన శివమ్ మావి బౌలింగులో నిసాంకను పెవిలియన్ పంపించాడు.
ఇవి కూడా చదవండి :
భారత్ తరఫున ఫాస్టెస్ట్ బాల్ విసిరిన ఉమ్రాన్ మాలిక్.. శ్రీలంక కెప్టెన్ ఔట్!
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు