Sanju Samson did not get a place in the third T20
mictv telugu

సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశ

November 22, 2022

భారత్ తుది జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 అవకాశం వస్తుందని ఆశపడిన సంజూకు జట్టులో చోటు దక్కలేదు. రెండో టీ20 ఆడిన జట్టులో ఒకే మార్పును చేసి బరిలో దిగింది టీంఇండియా. వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. వరుసగా విఫలమవుతున్న పంత్‌పై మరోసారి నమ్మకముంచారు.

గత మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు స్థానం లభించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్లు, కోచ్‌లు, వేదికలు మారినా సంజూ శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అతడి టాలెంటె‌ను తొక్కేస్తున్నారని అభిమానులు మండిపడ్డారు. వరుసగా విఫలవుతున్న పంత్‌కు అవకాశాలు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి తర్వాతైనా బుద్ధి తెచ్చుకోవాలని చురకలంటించారు. ఈ నేపథ్యంలో మరోసారి తుది జట్టులో సంజూశాంసన్‌కు చోటులేకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. సిరీస్‌కు ఎంపిక చేయడం బెంచ్‌లో కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.