Sanju Samson hot comments..if you want to get a place in the team..
mictv telugu

సంజు శాంసన్ హాట్ కామెంట్స్..జట్టులో చోటు దక్కాలంటే..

September 22, 2022

టీమిండియా యువ బ్యాట్‌మెన్, వికెట్ కీపర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన టీ20 ప్రపంచకప్‌ టీంలో తనకెందుకు చోటు దక్కలేదనే అంశంపై తొలిసారిగా స్పందించాడు. ‘టీమిండియా జట్టులో చోటు దక్కాలంటే, అది ఓ సవాళ్లతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఆ విషయంలో తీవ్రమైన పోటీ ఉంటుంది. తుది జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంటుంది’ అని అన్నారు.

ఆస్ట్రేలియాలో అక్టోబర్ నెలలో జరగబోయే టీ20 ప్రపంచకప్ టోర్నీకి సంబంధించి, తాజాగా బీసీసీఐ తుది జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులో సంజు శాంసన్‌కి ఎందుకు చోటు ఇవ్వలేదనే అంశంపై క్రికెట్ అభిమానులు బీసీసీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విషయంపై సంజు శాంసన్ ఎప్పుడెప్పుడు స్పందిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సంజు శాంసన్ స్పందిస్తూ, పలు సంచలన విషయాలను వెల్లడించాడు.

”టీమిండియాలో చోటు దక్కించుకోవడం నిజంగా చాలా సవాళ్లతో కూడుకున్నది. ఆ విషయంలో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడున్న జట్టులోని ఆటగాళ్లకు కూడా తుది జట్టులో స్థానం కోసం పోటీ తప్పదు. ఇలాంటివి జరిగినప్పుడు, నా ఆట మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అయితే, సవాళ్లను ఎదుర్కొంటూనే ఉండాలి. ప్రతిసారీ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనకూ అవకాశాలు వస్తాయి. ఆటగాళ్ల విషయానికొస్తే..ఒక స్థానానికే పరిమితం కావొద్దు. నేను ఓ పెనర్‌ని, నేను ఫినిషర్ అని ఎప్పుడూ చెప్పుకోవద్దు. గత మూడు, నాలుగేళ్ల నుంచి నేను వేర్వేరు స్థానాల్లో ఆడుతున్నా. అది నా ఆటలో కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఏ ఆర్డర్ లోనైనా ఆడగలనని విశ్వాసంతో ఉన్నా” అని ఆయన అన్నారు.