Sanju Samson meets Rajinikanth in Chennai After 21 Years Dream Comes True
mictv telugu

రజినీకాంత్‌ను కలిసిన సంజూ శాంసన్…ఫోటోస్ వైరల్

March 13, 2023

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రజినీ అభిమానులు కోకొల్లలు. పెద్దపెద్ద సెలబ్రిటీస్ సైతం రజినీ స్టైల్‌కు వీరాభిమానులే. టీం ఇండియా ప్లేయర్ సంజూ శాంసన్ కూడా తలైవాకు పెద్ద అభిమాని. సంజూ చిన్నప్పటి నుంచే రజినీకాంత్‌ను తెగ ఇష్టపడేవారు. అయితే ఇప్పటి వరకు అతనిని కలిసే అవకాశం రాలేదు. తాజాగా రజినీ కాంత్‌ను కలిసి శాంసన్ ఫోటో దిగాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందంతో ఉబ్బతబ్బిపోయాడు. తన అభిమాన నటుడు తలైవాను కలవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సంజూ-రజినీ ఫోటో వైరల్‎గా మారింది.

రజినీకాంత్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన సంజూ..రజినీపై ఉన్న అభిమానాన్ని రాసుకొచ్చాడు. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పటి నుంచే నేను రజినీ సార్‌కు పెద్ద ఫ్యాన్. అప్పుడే మా అమ్మానాన్నకు చెప్పా.. ఎప్పటికైనా నేను రజినీ సార్‌ను ఆయన ఇంట్లోనే కలిసి తీరతాను అని. ఇదిగో 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కోరిక తీరింది. తలైవర్ నన్ను ఆయన ఇంటికి ఆహ్వానించారు’ అని సంజూ ట్వీట్ చేశాడు.

టీం ఇండియాలో స్థానం కోసం సంజూశాంసన్ ఎదురు చూస్తున్నాడు. అడపదడపా అవకాశాలు వచ్చినా జట్టులో సుస్థిరమైన ప్లేస్ మాత్రం దొరక్కట్లేదు. ఈ ఏడాది మొదటిలో శ్రీలంక టీ20 సిరీస్‌కు శాంసన్‌ను ఎంపిక చేశారు. అయితే గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. తర్వాత అతడిని పరిగణలోకి తీసుకోలేదు. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం సంజూ శాంసన్‌ను అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫి చివరి టెస్ట్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో సంశాన్‌ను ఎంపిక చేస్తారని సమాచారం.