ఇండియన్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు దురదృష్టం వెంటాడుతోంది. ఇన్ని రోజులు జట్టులో అవకాశాలు కోసం వేచి చూసిన ఆతను ఇప్పుడు గాయం కారణంగా శ్రీలంక సిరీస్ నుంచి నిష్క్రమించాడు. మొదటి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సంజూ మోకాలికి గాయమైంది. వైద్యుల సూచన మేరకు సంజూ మిగిలిన రెండు టీ20లకు సంజూ శాంసన్ తప్పుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అతని స్థానంలో ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని విదర్భకు చెందిన యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మను సెలెక్టర్లు టీ20 జట్టులో చేర్చారు.
అనుభవంతో పాటు, టాలెంట్ ఉన్న సంజూశాంసన్‌కు అవకాశాలు రావడం లేదంటూ ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కోసం శాంసన్‌ను మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో సంజూని జట్టులోకి తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇటు మాజీలు కూడా సంజూకి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో గతేడాది
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఒక్క వన్డేలో మాత్రమే అతడికి ఆడే అవకాశం లభించింది. ఇక కొత్త సంవత్సరంలో శ్రీలంకతో టీ 20 సిరీస్ కు సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో రాణించి టీం ఇండియాలో నిలదొక్కుకోవాలని చూసిన సంజూ శాంసన్‌కు గాయం రూపంలో మరోసారి దురదృష్టం వెంటాడింది. తొలి టీ20లో ఆడే అవకాశం లభించినప్పటికీ శాంసన్ ఆకట్టుకోలేకపోయాడు. 6 బంతుల్లో 5 పరుగులు నిరాశపర్చాడు.