ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ బోణీ కొట్టింది. ఫురుషుల వెయిట్ లిప్టింగ్ 55 కేజీల విభాగంలో పోటీపడిన సంకేత్ సర్గర్ రజత పతకాన్ని గెలుపొందాడు. సంకేత్ సర్గర్ ఫస్ట్ క్లీన్ అండ్ జర్క్ అటెంప్ట్‌లో 135 కేజీల బరువుని ఎత్తి పతక రేసులో నిలిచాడు. కానీ.. సెకండ్ అటెంప్ట్‌లో 139 కేజీలు ఎత్తే సమయంలో అతను గాయపడ్డాడు. అయినప్పటికీ.. మూడో అటెంప్ట్ కోసం ట్రై చేశాడు. కానీ.. మోచేతి గాయం నొప్పిని తాళలేకపోయాడు. దాంతో.. రజత పతకంతో సరిపెట్టాడు.
ఇక మలేషియాకు చెందిన బిన్ మహమద్ అనిఖ్.. సంకేత్ కంటే కేవలం ఒకే ఒక్క కేజీ అదనంగా ఎత్తి గోల్డ్ మెడల్‌ను ఎగరేసుకుపోయాడు. స్నాచ్‌లో 107 కేజీలను మాత్రమే ఎత్తిన అనిఖ్.. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం 142 కేజీలను ఎత్తాడు. దీంతో మొత్తం 249 కేజీల బరువును మోసి గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకకు చెందిన దిలాంక ఇసురు కుమార యోదగె 225 కేజీలతో (స్నాచ్ -105, క్లీన్ అండ్ జెర్క్ – 120) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు.