సంక్రాంతి పండగ రద్దీని దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అదనపు రైళ్ళను ప్రకటించింది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఇప్పటికే 94 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా వాటికి అదనంగా మరో 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్, కాచిగూడ, వికారాబాద్ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాల మధ్య ఇవి నడవనున్నాయి. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రయాణికులకు స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లకు ఈ నెల 31 నుంచి రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ వో సీహెచ్. రాకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
స్పెషల్ రైళ్ల వివరాలు :
*జనవరి 6న సికింద్రాబాద్–కాకినాడ టౌన్ మధ్య రైలు (07048)
జనవరి 7న కాకినాడ టౌన్–సికింద్రాబాద్ మధ్య రైలు(07049)
జనవరి 7న హైదరాబాద్–నర్సాపూర్ (07019)
జనవరి 8న నర్సాపూర్–వికారాబాద్ (07020)
జనవరి 9న వికారాబాద్–నర్సాపూర్ (07021)
జనవరి 9న సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07039)
జనవరి 10న కాకినాడటౌన్–వికారాబాద్ (07040)
జనవరి 10న నర్సాపూర్–హైదరాబాద్ (07022)
జనవరి 11న వికారాబాద్–నర్సాపూర్ (07041)
జనవరి 11,13న హైదరాబాద్– మచిలీపట్నం (07011)
జనవరి 12న నర్సాపూర్–సికింద్రాబాద్ (07042)
జనవరి 12,14న మచిలీ పట్నం–హైదరాబాద్ (07012) రైళ్లు నడవనున్నాయి.
* జనవరి 11న సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07035)
జనవరి 12న,కాకినాడ టౌన్–వికారాబాద్ (07036)
జనవరి 13న, వికారాబాద్– కాకినాడటౌన్ (07037) 13న,
జనవరి 13న సికింద్రాబాద్–నర్సాపూర్ (07023)
జనవరి 14న,కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07038)
జనవరి 14న, నర్సాపూర్–సికింద్రాబాద్ (07024)
జనవరి 15న, సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07031)
జనవరి 16న, సికింద్రాబాద్కాకినాడ టౌన్ (07027) 16న,
జనవరి 16న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07032)
జనవరి 17న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07028) 17న,
జనవరి 17న, వికారాబాద్–కాకినాడ టౌన్ (07033)
జనవరి18న, కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07034) 18న,
జనవరి 15, 17 తేదీల్లో, హైదరాబాద్–నర్సాపూర్ర్ (07015)
జనవరి 16, 18 నర్సాపూర్–హైదరాబాద్ (07016) తేదీల్లో పరుగులు పెట్టనున్నాయి.
ఇవి కూడా చదవండి :
ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
పీవీ సింధుకు కూడా చంద్రబాబే ఆట నేర్పించా అంటారు : జగన్
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా…..ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం