సంక్రాంతి పండగ వచ్చేస్తుంది అంటే చాలు కోడి పందాలు గుర్తొస్తాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వీటి హంగామా ఎక్కువ ఉంటుంది. ఈ సారి కూడా అదే సందడి కనబడుతోంది.
ఇప్పటినుంచే నిర్వాహకులు పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎప్పటిలాగే కోడి పందాలపై ఆంక్షలు విధించారు. పందాలకు అనుమతి లేదని.. నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ ఇలానే చెబుతారని అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఈ సారి మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే పలు సెక్షన్లు కింద వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామంటున్నారు. కోడి కత్తులను తయారీ చేసేవాళ్లను, కోడిపుంజులు అమ్మేవాళ్లపై, స్థల యజమానులపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పాటు 5 లక్షలు పూచీకత్తు కూడా తీసుకుంటామని తెలిపారు. కోడిపందాలు వంటి వాటికి వెళ్లకుండా సంప్రదాయ క్రీడా పోటీలపైనే యువత దృష్టి పెట్టాలని డీఐజీ పాలరాజు సూచించారు.
ఒక పక్క పోలీసులు అనుమతి లేదని చెబుతుంటే మరోపక్క నిర్వాహకులు మాత్రమం తమ పని తమదే అంటున్నారు. కోడి పందాలకు నిర్వహకులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఇక పందెం కోడి లక్ష నుంచి ఐదు లక్షల ధర పలుకుతోంది. ఇప్పటినుంచి అడ్వాన్స్‌ల కింద నోట్లకట్టులు చేతులు మారుతున్నాయి. భీమవరం పాలకొల్లు నర్సాపురం వంటి ప్రాంతాల్లో ఇప్పటి నుంచి సంక్రాంతికి లాడ్జిలు బుక్ అయ్యాయి. ప్రభుత్వ ఆంక్షలు ఎన్నున్నా సంక్రాంతి మూడు రోజులు కోడిపందాలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
ఏపీలో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించేది ఎప్పుడంటే..
గుర్రంపై ‘గడప గడపకు’ వైసీపీ ఎమ్మెల్యే
బీజేపీకి ఎదురుదెబ్బ… కొత్త పార్టీని ప్రకటించిన గాలి జనార్ధన్ రెడ్డి