రోగులపై మృత్యంజయ మంత్రప్రయోగం.. ప్రసిద్ధ ఆస్పత్రిలో - MicTv.in - Telugu News
mictv telugu

రోగులపై మృత్యంజయ మంత్రప్రయోగం.. ప్రసిద్ధ ఆస్పత్రిలో

September 12, 2019

mahamrityunjaya mantra.

గోమూత్రం సేవిస్తే క్యాన్సర్ తగ్గుతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా మహామృత్యుంజయ మంత్రం తెరపైకి వచ్చింది. దేశంలో మొదటిసారి మహామృత్యుంజయ మంత్రంపై పరిశోధనలు చేస్తున్నారు. ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలోని ఐసీయూ విభాగంలో ఉన్న రోగులపై ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల కోసం తలకు గాయమై చికిత్స పొందుతున్న 40మంది రోగులను ఎంపిక చేసారు. 

ఈ ప్రక్రియకు ముందు సంస్కృత విద్యాపీఠ్ నుంచి వచ్చిన పండితులు ఎంపిక చేసిన రోగులకు ఆసుపత్రిలోనే సంకల్పమిస్తున్నారు. తరువాత వారిని సంస్కృత విద్యాపీఠ్‌కు తీసుకువెళ్లి మంత్రాలను వినిపిస్తున్నారు. మొత్తం 40 మంది రోగుల్లో 20 మందిని విద్యాపీఠ్ తీసుకువెళ్లి మంత్రాలను వినిపించారు. ఈ పరిశోధనల కోసం రోగులను రెండు బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంలో 20 మంది రోగులున్నారు. మొదటి బృందంలోని 20 మంది రోగులకు మంత్రం వినేందుకు ముందు సంకల్పమిచ్చారు. శాస్త్రబద్ధంగా రోగులకు ఈ ప్రక్రియను నిర్వహించారు. భారతీయ శాస్త్రాలలో మృత్యుంజయ మంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే వైజ్ఞానికంగా ఈ మంత్ర ప్రభావం గురించి తెలుసుకునేందుకు పరిశోధనలు నిర్వహిస్తున్నారన్నారని ఆర్ఐఎల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ చౌదరి తెలిపారు. ఇప్పటివరకు ఈ పరిశోధనల వలన సత్ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి స్పష్టత వచ్చిన తరువాత వైద్యచికిత్సలో దీనిని భాగం చేయనున్నారు.