రేణిగుంట హీరోయిన్‌పై లైంగిక దాడి - MicTv.in - Telugu News
mictv telugu

రేణిగుంట హీరోయిన్‌పై లైంగిక దాడి

February 2, 2018

సాధారణ మహిళలే కాకుండా హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు కూడా కామాంధుల బారిన పడుతున్నారు. నటి అమలాపాల్‌పై లైంగిక వేధింపుల ఉదంతాన్ని మరవక ముందే మరో యువనటిపై అత్యాచార యత్నం చోటుచేసుకుంది. రేణిగుంట, భీమ తదితర చిత్రాల్లో నటించిన మలయాళి నటి సనూషాపై కదులుతున్న రైల్లో ఓ మృగాడు కీచకానికి ఒడిగట్టాడు.సనూష బుధవారం రాత్రి కన్నూర్ నుంచ తిరువనంతపురానికి రైల్లో వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన ఆంతోబోస్ అనే వ్యక్తి.. తన సీట్లో పడుకుని ఉన్న సనూషపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె అరచి కేకలు వేసింది. తర్వాత టీటీఈకి ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచారు. తమిళంలోని తీసిన రేణిగుంట సినిమాను అదేపేరుతో తెలుగులోకి అనువదించారు. అందులో సనూష అత్యంత సహజనగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతోపాటు పలు సినిమాల్లో చక్కని నటనకు గాను ఆమె పలు అవార్డులు అందుకున్నారు. అంతకు ముందే ఆమె ఉత్తమ బాలనటిగా అవార్డు సాధించింది.