‘ఎవర్రా నీకు వదినా?’..ఫ్యాన్‌ వెంటపడిన బాలీవుడ్ బ్యూటీ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఎవర్రా నీకు వదినా?’..ఫ్యాన్‌ వెంటపడిన బాలీవుడ్ బ్యూటీ

February 14, 2020

బాలీవుడ్ నటులు కార్తిక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ ఆజ్ కల్’. సైఫ్ అలీ ఖాన్ 2009లో నటించిన ‘లవ్ ఆజ్ కల్’ సినిమాకు ఇది రీమేక్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. 

View this post on Instagram

Bhabhi kisko bola ☺️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రోజున కార్తిక్ గల్లీలో యువకులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఆ సమయంలో సారా కూడా అక్కడే ఉన్నారు. సారాను చూడగానే అక్కడే ఉన్న ఓ యువకుడు.. ‘కార్తిక్ అన్నా.. సారా వదిన వచ్చారు చూడు’ అన్నాడు. దాంతో కార్తిక్ పగలబడి నవ్వుకున్నారు. అభిమాని అలా పిలవడం విన్న సారా ‘ఎవర్రా నీకు వదిన’ అంటూ అభిమాని వెంటపడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోను కార్తిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.