సుశాంత్‌తో డేటింగ్ చేశా : సారా అలీఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్‌తో డేటింగ్ చేశా : సారా అలీఖాన్

September 28, 2020

Sara Ali Khan in Drugs

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటి సారా అలీఖాన్ కీలక విషయాలను వెల్లడించింది. ఎన్సీబీ విచారణకు హాజరైన ఆమె సుశాంత్‌తో డేటింగ్ విషయాన్ని బయటపెట్టింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించగా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డ్రగ్ వాడకంపై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. తాను ఏనాడ డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది. 

సుశాంత్ తాను కొంత కాలం డేటింగ్ చేశానని వెల్లడించింది. ఇద్దరూ కలిసి థాయ్ లాండ్ పర్యటనకు కూడా వెళ్లామని చెప్పింది. అయితే తానకు సిగరేట్ అలవాటు మాత్రమే ఉందని, డ్రగ్ మాత్రం ఎప్పుడూ వాడలేదని తెలిపింది. సుశాంత్ డ్రగ్ తీసుకునేవాడని అంగీకరించింది. అతని ఫాం హౌజ్‌లో జరిగే పార్టీలో కూడా డ్రగ్ వాడేవారని తెలిపింది. కాగా, ఇప్పటికే డ్రగ్ కేసు విచారణలో దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌లను విచారించారు.