కేదార్ నాథ్ పై సినిమా ! - MicTv.in - Telugu News
mictv telugu

కేదార్ నాథ్ పై సినిమా !

July 17, 2017

సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ డెబ్యూ మూవీ ‘ కేదార్ నాథ్ ’ ఈ అగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఎటువంటి సెట్లు గిట్లు లేకుండా ఒరిజినాలిటీ కోసం టీం అందరూ కలిసి కేదార్ నాథ్ వెళ్ళి అక్కడ అందమైన లొకేషన్లలో పిక్చర్ షూట్ చేస్తారట. అభిషేక్ కపూర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దీనికి. ఏక్తా కపూర్, శోభా కపూర్లు కో ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా చేస్తున్నాడు ఈ సినిమాలో. శివుడు కొలువైయున్న కేదార్ నాథ్ పుణ్య క్షేత్రం సాక్షిగా సాగే అందమైన ప్రేమకథ ఇదని, ఇప్పటికే ఈ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. ఎందుకంటే సైఫ్ అలీఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా సారా సినిమాల్లోకి రావడం ఒకెత్తైతే, ఈ సినిమాను మంచి టేస్టున్న నిర్మత ఏక్తా కపూర్ ఒక నిర్మాతగా వ్యవహరించడం అనేది ఇంట్రెస్టింగ్ ను క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి.

అలాగే రాక్ ఆన్, కయ్ పోచె, ఫితూర్ వంటి హిట్ సినిమాలు తీసిన అభిషేక్ కపూర్ ఈ సినిమాకు దర్శకుడవటం మరింత ఆసక్తిని నెలకొలిపింది. సారా అలీఖాన్ కు ఈ సినిమా మంచి బోణీ అవుతుందని విశ్లేషకులు అభిలషిస్తున్నారు.